'అర్జున్ సురవరం' టీజర్ మెగాస్టార్ కి నచ్చేసిందట!

  • నిఖిల్ హీరోగా 'అర్జున్ సురవరం'
  • ఆకట్టుకుంటోన్న టీజర్
  • ప్రముఖుల నుంచి ప్రశంసలు
నిఖిల్ హీరోగా సంతోష్ దర్శకత్వంలో రూపొందిన 'అర్జున్ సురవరం' నుంచి నిన్న టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ను వదిలిన 24 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ కి పైగా వచ్చాయి. ఈ టీజర్ ను చూసి చిరంజీవి మెసేజ్ పెట్టడం విశేషం. ఈ విషయాన్ని గురించి నిఖిల్ మాట్లాడుతూ .."ఈ సినిమా టీజర్ ను విడుదల చేసిన తరువాత, పలువురు ప్రముఖుల నుంచి నిర్మాత రాజ్ కుమార్ గారికి మెసేజ్ లు వస్తున్నాయి.

ఒక మెసేజ్ ను మాత్రం ఆయన అదే పనిగా చూస్తూ మురిసిపోతున్నాడు. ఆ మెసేజ్ ను ఎవరు పంపించి వుంటారా అని ఆయన నుంచి ఫోన్ లాక్కుని చూశాను .. అది మెగాస్టార్ పంపించిన మెసేజ్ .. అంతే షాక్ అయ్యాను. "ఇప్పుడే 'అర్జున్ సురవరం' టీజర్ చూశాను .. చాలా ఆసక్తికరంగా వుంది. మీకు .. దర్శకుడికి .. నిఖిల్ కి ఆల్ ది బెస్ట్' అంటూ ఆయన మెసేజ్ చేశారు. నిజంగా ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు" అని సంతోషంతో  పొంగిపోతున్నాడు.
Go Back to Shorts
nikhil
lavanya tripathi

More Telugu News